టెహ్రాన్, జనవరి 10: తమ దేశ రాజధానిని టెహ్రాన్ నుంచి దక్షిణ తీర ప్రాంత నగరం మక్రాన్కు మారుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఆర్థిక, పర్యావరణ సమస్యలు, అధిక జనాభా, నీటి కొరత, విద్యుత్తు కొరతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ అధికార ప్రతినిధి మొహజెరానీ తెలిపారు. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన రాజధానిని మక్రాన్లో నిర్మించేందుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి రెండు మండళ్లను నియమించినట్టు ఆమె తెలిపారు.
వివిధ రంగాల నిపుణుల సూచనలు, సలహాలను ఈ మండళ్లు విశ్లేషిస్తాయని చెప్పారు. అయితే రాజధాని మార్పు వెంటనే జరగదని ఆమె వెల్లడించారు. రాజధానిని మార్చడానికి భారీ ఆర్థిక వ్యయం, రవాణా సమస్యలు ఏర్పడతాయని విమర్శకులు తెలిపారు.