ముంబై: జన్మతహ పౌరసత్వం గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో రీపోస్టు చేసి వివాదం సృష్టించారు. ఇండియా, చైనా దేశాలను నర కూపాలతో పోల్చుతూ కామెంట్ చేశారు. సావేజ్ కామెంట్లను సమర్ధిస్తూ ట్రంప్ చేసిన రీపోస్టుపై తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ట్రంప్ పోస్టుకు ఇరాన్ కూడా కౌంటర్ ఇచ్చింది. ముంబైలో ఉన్న ఇరానీ కౌన్సులేట్ (Iran Consulate) జనరల్ ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేసింది. మహారాష్ట్రలో ఉన్న సాంస్కృతిక, సహజ సంపదలు ప్రతిబించేలా ఆ పోస్టు ఉన్నది. ట్రంప్‌కు సైటైర్ వేసిన రీతిలో ఇరాన్ కౌన్సులేట్ తన పోస్టును పెట్టింది. ఓసారి ఇండియాకు వచ్చి వెళ్లాలంటూ ట్రంప్‌కు చురక వేసింది. కబీ ఇండియా ఆకే దేఖో.. ఫిర్ బోల్నా అంటూ ఆ పోస్టులో ఇరాన్ కామెంట్ చేసింది. ఇండియాను విజిట్ చేస్తే.. ట్రంప్ పిచ్చవాగుడు తగ్గుతుందని ఇరాన్ కాన్సులేట్ తన పోస్టులో అభిప్రాయపడింది.
Maybe someone should book a one-way cultural detox for Mr. #Trump, it might just reduce the random bakwaas 😏
Kabhi #India aa ke dekho, phir bolna. pic.twitter.com/kkocLZ31XX
— Iran in Mumbai (@IRANinMumbai) April 23, 2026