బీజింగ్, నవంబర్ 7: లేటెస్ట్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, మీరు కొద్దిరోజులు ఆగాల్సిందే. చైనాలో జీరో కొవిడ్ పాలసీలో భాగంగా విధించిన ఆంక్షలతో ఐఫోన్ తయారీలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో సరఫరాలో జాప్యం జరుగుతున్నది. ఈ విషయాన్ని యాపిల్ కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. జెంగ్‌ఝౌలోని ఫాక్స్‌కాన్‌కు చెందిన ఐఫోన్ తయారీ కేంద్రం పరిసరాల్లో కొవిడ్ ఆంక్షలు విధించినట్టు పేర్కొంది. దీంతో కార్యకలాపా లు మందగించాయని తెలిపింది. ఫలితంగా ఐఫోన్-14, ఐఫోన్-14 ప్రో మ్యాక్స్ సరఫరా అంచనాల కంటే ఆలస్యంగా జరుగుతున్నదని వెల్లడించింది. దీంతో లేటెస్ట్ ఐఫోన్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.