Boston Murder |బోస్టన్: అమెరికాలో 36 ఏండ్ల క్రితం జరిగిన కారెన్ టేలర్ అనే మహిళ హత్య కేసును దర్యాప్తు అధికారులు ఎట్టకేలకు ఇప్పుడు ఛేదించారు. 1988 మే 27న బోస్టన్లోని రాక్స్బరీ నైబర్హుడ్ అపార్ట్మెంట్లో జేమ్స్ హోలోమన్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టు డీఎన్ఏ సాక్ష్యాధారాల ఆధారంగా తేల్చారు.
వాస్తవానికి అప్పట్లో టేలర్ మృతదేహం వద్ద హోలోమన్కు సంబంధించిన ఓ చెక్కును దర్యాప్తు అధికారులు గుర్తించినప్పటికీ కచ్చితమైన నిర్ధారణకు రాలేకపోయారు. కానీ, నిరుడు ఓ కాలిబాటపై హోలోమన్ వేసిన ఉమ్మి నుంచి అతని డీఎన్ఏను సేకరించి పరీక్షించగా హత్యకు ఆతడే పాల్పడ్డాడని తేలింది.