Off duty Cop | ఇతడి పేరు అబ్రీ హోర్టన్.. ఈ ఆఫ్ డ్యూటీ పోలీసాఫీసర్ (ప్రస్తుతం డ్యూటీలో లేడు)ను గతంలో జార్జియాలో ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. అయితే పొరుగువారింట్లోకి దూరి హత్యకు గురయ్యాడు. సెయింట్ అండ్రీవ్స్ కంట్రీ క్లబ్ సమీపంలోని విన్స్టన్ ఇంట్లోకి అబ్రీ హోర్టన్ ఉదయం 5 గంటల సమయంలో మెయిన్ డోర్ నుంచి ఇంట్లోకి చొరబడే క్రమంలో యజమాని విన్స్టన్తో ఘర్షణ జరిగింది.
ఈ నేపథ్యంలో విన్స్టన్ ఆత్మరక్షణలో భాగంగా అబ్రీ హార్టన్ను కాల్చి చంపాడని న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. అబ్రీ హోర్టన్ ఘటన జరిగిన ప్రదేశానికి కిలోమీటర్లోపు దూరంలోనే ఉంటాడని.. ఈ ఘటనతో స్థానికులంతా షాక్‌కు లోనయ్యారని వెల్లడించింది. కాగా అబ్రీ హోర్టన్ మానసిక ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం లేదా డ్రగ్స్‌కు బానిసై ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. నేనిక్కడ ఐదేళ్లుగా ఉంటున్నా. ఎవరూ ఊహించని ఘటన జరిగిందని స్థానికుడు మిల్టన్ జాన్స్టన్ చెప్పాడు. ఇది నిశ్శబ్ధంగా ఉండే గోల్ఫింగ్ కమ్యూనిటీ ఏరియా. ఇక్కడ ఇలాంటి ఘటన జరుగుతుందని ఎప్పుడూ మీరు అనుకోరని మరో స్థానిక వ్యక్తి చెప్పుకొచ్చాడు.
యూఎస్ మార్షల్స్ సర్వీస్ విభాగంలోని అబ్రీ హోర్టన్‌కు అట్లాంటా పోలీస్ (ఏపీడీ) డిపార్ట్మెంట్లో విధులను కేటాయించారు. 2015 నవంబర్‌లో అతడు డిపార్ట్మెంట్లో చేరాడు. 21 ఏండ్ల లియోండ్రే ఫ్లైంట్ మృతికి సంబంధించిన హై ప్రొఫైల్ కేసును చేధించి మంచి గుర్తింపు పొందాడు. ఈ మృతికి సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. కేసును చేధించిన అబ్రీ హోర్టన్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటున్న సమయంలో.. లియోండ్రే ఫ్లైంట్ ఇన్వెస్టిగేషన్ కేసు తనకు చాలెంజింగ్‌గా అనిపించిందని.. కానీ ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగిందని భావిస్తున్నానని చెప్పాడు.
Dhanush – Mrunal | ధనుష్‌తో పెళ్లి పుకార్ల మధ్య మృణాల్ ఠాకూర్ వైరల్ వీడియో… షాక్ అవుతున్న నెటిజన్స్
MSG | లాంగ్ వీకెండ్ టార్గెట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’… మళ్లీ ఊపందుకున్న మెగాస్టార్ సినిమా
Rimi Sen | నటన రాదు అయిన స్టార్ అయ్యాడు.. జాన్ అబ్రహంపై రిమీ సేన్ సంచలన వ్యాఖ్యలు