న్యూయార్క్, మదురై, జూన్ 21: న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్, టైమ్స్ స్కేర్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన చౌరస్తాగా పరిగణించే టైమ్స్ స్కేర్ వద్ద యోగ అభ్యాసకులు, స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. టైమ్స్ స్కేర్ మధ్యలో వందలాది మంది యోగాసనాలు వేస్తున్న ఫోటోలను భారత కాన్సులర్ జనరల్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 73 ఏండ్ల తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఫిట్నెస్ అందరినీ విస్మయానికి గురిచేసింది. మదురైలోయోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ రవి 51 పుష్ అప్లు పూర్తి చేసి శారీరక దారుఢ్యానికి వయసుతో పని లేదని నిరూపించారు.