శాన్ ఫ్రాన్సిస్కో: అంతర్జాతీయ కన్సల్టింగ్ సేవల సంస్థ మెకిన్సీఅండ్కో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆ సంస్థ ఒకేసారి 2 వేల మందిపై వేటేయాలని చూస్తున్నట్టు ప్రముఖ మీడియా సంస్థ బ్లూంబర్గ్ కథనాన్ని ప్రచురించింది.
‘ప్రాజెక్ట్ మగ్నోలియా’లో భాగంగా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నది. దశాబ్ద కాలం తర్వాత నాన్-క్లయింట్-సేవల విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ఈ విభాగాన్ని పున:రూపకల్పన చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.