వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత భేదాభిప్రాయాలు బయటపడుతున్నాయి. యూఎస్ సెనేటర్, టెక్సాస్ రిపబ్లికన్ టెడ్ క్రుజ్ మాట్లాడిన ఓ ఆడియో సంచలనం సృష్టిస్తున్నది. వాణిజ్య విధానాలు, భారత్-అమెరికా మధ్య టారిఫ్ అగ్రిమెంట్ ప్రతిష్టంభనకు కారకులు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్ హౌస్ సలహాదారు పీటర్ నవారో, కొన్ని సందర్భాల్లో స్వయంగా ట్రంప్ అని టెడ్ క్రుజ్ ఈ ఆడియోలో చెప్పారు.
దాదాపు 10 నిమిషాల నిడివి గల ఈ ఆడియోను రిపబ్లికన్ వర్గాలు బయటపెట్టాయి. ఇది 2025 తొలి అర్ధ సంవత్సరంలో మాట్లాడిన ఆడియో. టెడ్ ప్రైవేట్ డోనర్స్తో మాట్లాడుతుండగా ఈ ఆడియోను క్యాప్చర్ చేశారు.