Indonesia earthquake | ఇండోనేషియాలో భూకంపం.. 310 కి చేరిన మృతుల సంఖ్య
Indonesia earthquake | ఇండోనేషియాలో గత సోమవారం సంభవించిన భూకంప మృతుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య
జకర్తా: ఇండోనేషియాలో గత సోమవారం సంభవించిన భూకంప మృతుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 310కి చేరిందని ఇండోనేషియా నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. పశ్చిమ జావాలోని సియాంజుర్ ప్రాంతంలో గత సోమవారం మధ్యాహ్నం 1.21 గంటలకు 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
ఈ ఘటనలో 200 మందికిపైగా మరణించారు. 2000 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. మొత్తం 56,320 ఇండ్లు ధ్వంసమయ్యాయి. 31 పాఠశాలలు, 124 ప్రార్థనా స్థలాలు, మూడు ఆస్పత్రులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 62 వేల మంది ఆవాసాలు కూలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయుల కోసం ఆ ప్రాంతంలో 14 శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేశారు.
గత ఐదు రోజులుగా భూకంప ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. భవనాల శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో మృతుల సంఖ్య 310కి చేరింది. ఇప్పటికీ ఇంకా 24 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

