కీవ్, ఆగస్టు 12: యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్‌కు భారతీయులు అండగా నిలబడ్డారు. ఆపద సమయంలో ఆ దేశాన్ని ఆదుకున్నారు. కదనరంగంలో ఆ దేశం తరఫున పోరాటానికి దిగి స్ఫూర్తిగా నిలిచారు. రష్యాతో పోరాటంలో ఉక్రెయిన్ సేనలతో కలిసి పోరాడుతూ ముగ్గురు భారతీయులు సాహసం చేశారు.
భారత్‌కు చెందిన ఆండ్రి, నవీన్, మరో వ్యక్తి ఆయుధాలు చేతబట్టారు. తమకు అన్నం పెట్టి ఆదరించిన ఆ దేశానికి ఆపద వేళ ఆపన్నహస్తం అందించారు. చదువులు, ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్‌లో నివసిస్తున్న వీరు తమ కళ్లముందే విధ్వంసం జరుగుతుంటే చూడలేక ఇంటర్నేషనల్ లెజియన్‌లో చేరి సైనికులుగా సేవలు అందిస్తున్నారు.