America | దేశం వీడుతున్న అమెరికన్లు.. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వాగ్దానాల అమలుపై భయాందోళన!
అమెరికా వెళ్లాలని కలలు గనని భారతీయుడు ఉండరు. ఇక వెళ్లే అవకాశం లభించిన వారు ఎన్నో ఆశలతో ఆ గడ్డపై అడుగు పెడుతుంటారు. స్వేచ్ఛకు మారుపేరుగా పేరొందిన అమెరికా ప్రతిభావంతులను ఎప్పుడూ నిరుత్సాహపరచదు.
- గర్భస్రావం, లింగమార్పిడి ఆపరేషన్ల నియంత్రణపై వ్యతిరేకత
- యూరప్, లాటిన్ అమెరికాకు వలస వెళ్లేందుకు ఆసక్తి
America | వాషింగ్టన్, నవంబర్ 13: అమెరికా వెళ్లాలని కలలు గనని భారతీయుడు ఉండరు. ఇక వెళ్లే అవకాశం లభించిన వారు ఎన్నో ఆశలతో ఆ గడ్డపై అడుగు పెడుతుంటారు. స్వేచ్ఛకు మారుపేరుగా పేరొందిన అమెరికా ప్రతిభావంతులను ఎప్పుడూ నిరుత్సాహపరచదు. ఇందుకోసం కొంతమంది దొడ్డిదారిలోనైనా సరే అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ గత వారం రోజుల వ్యవధిలో పరిస్థితి తారుమారైంది. భారత్‌తోపాటు పలు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో స్థిరపడేందుకు వేచి చూస్తుండగా.. అమెరికన్లలో కొద్దిమంది మాత్రం దేశం వీడి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు పలు వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తరువాత ఈ ధోరణి మరింత పెరిగినట్టు తెలుస్తున్నది.
ట్రంప్ విధానాలపై ఆందోళన..
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చాలామంది నొమాడ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో ఉంటూ సొంతదేశంలోని కంపెనీ కోసం పనిచేసేందుకు నొమాడ్ వీసా అనుమతిస్తుంది. వీసా గడువు ముగిసేంతవరకూ వీరు విదేశాల్లో ఉంటూ పనిచేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాల అనంతరం చాలామంది యూరోప్, కెనడా, మెక్సికో వంటి దేశాలకు వలస వెళ్లడం ఎలా అన్నదానిపై గూగుల్‌లో వెతికినట్టు వెల్లడైంది. తమను తాము స్వేచ్ఛాజీవులుగా చెప్పుకొనే అమెరికన్లు.. ట్రంప్ హయాంలో తమపై అణచివేత తప్పదని భావిస్తున్నారు. వలసలను అదుపుచేస్తానని, గర్భస్రావాలను, లింగమార్పిడి శస్త్ర చికిత్సలను అరికడతానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానాలపై దేశంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ట్రంప్ విధానాలను వ్యతిరేకించే వారిలోనే ఎక్కువ మంది దేశం విడిచి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు న్యూయార్క్ టైమ్స్, యూఎస్ఏ టుడే వంటి సంస్థలు పేర్కొన్నాయి. 2016లో ట్రంప్ గెలిచినప్పుడు కూడా ఇదే ధోరణి కనిపించిందని ఆ పత్రికలు గుర్తుచేశాయి.
దేశం వీడటమే బెటర్!..
‘నా స్నేహితుల్లో కనీసం 50 శాతం మంది రాజకీయ కారణాలతోనే దేశం వీడి వెళ్లాలనుకుంటున్నారు’ అని పోర్చుగల్‌కు వలస వెళ్లిన జస్టిన్ నెప్పర్ (48) అనే అమెరికన్ తెలిపాడు. ట్రంప్ విధానాల కారణంగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న చాలామంది దేశం విడిచి వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నట్టు డైర్డ్రే రోనీ అనే మహిళ తెలిపింది. దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నవారు తమ అభిప్రాయాలను పంచుకొనేందుకు ఏకంగా ఆర్/అమెరెగ్జిట్ పేరిట ఒక సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించారు. ట్రంప్ గెలవగానే ఈ పోర్టల్‌లో పోస్ట్‌లు వెల్లువెత్తాయి. ఈ వేదిక ద్వారా వివిధ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాల గురించి వారు పరస్పరం సమాచారం అందించుకున్నారు. పౌరుల భద్రత విషయంలో 162 దేశాలలో అమెరికా 131 స్థానంలో ఉన్నది. అమెరికన్లు దేశం విడిచి వెళ్లేందుకు ఇది కూడా ఒక కారణమని, భద్రత కోసం చాలామంది యూరోపియన్ దేశాలవైపు చూస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Americans
- Donald Trump
- Indians
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

