Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Man Dragged On Car Roof | ఒక వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించారు. కారు రూఫ్‌పై అతడ్ని పడేసి కొంతదూరం తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడి పైనుంచి కారు నడిపి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ఒక వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించారు. కారు రూఫ్‌పై అతడ్ని పడేసి కొంతదూరం తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడి పైనుంచి కారు నడిపి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. కాన్పూర్‌లోని అర్రా ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల బీరు సింగ్ ఆహార ఉత్పత్తుల సంస్థలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వివాహితుడైన అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కాగా, అక్టోబర్ 20న రాత్రి 10:30 గంటల సమయంలో బీరు సింగ్, దసరా ఉత్సవాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. పాత శతృత్వం ఉన్న మేవాలాల్, రాజ్వీర్ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి అతడిని అడ్డుకుని కొట్టారు. సింగ్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత కారు రూఫ్‌పైకి అతడ్ని నెట్టారు. సింగ్ చేతులను కారు విండోల మధ్యలో ఇరికించారు. కారు రూఫ్‌పై ఉన్న అతడ్ని ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత సింగ్‌ను రోడ్డుపై పడేశారు. అతడిపై నుంచి కారు నడిపి పారిపోయారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన సింగ్‌ను తెలిసిన వ్యక్తి గుర్తించాడు. అతడి కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు సింగ్‌ను ఆసుపత్రికి తరలించగా అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింగ్‌ను కారు రూఫ్‌పై తీసుకెళ్లిన వీడియో క్లిప్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#UttarPradesh #Kanpur. A young man returning after watching the Dussehra fair in Hanumant Vihar was brutally murdered due to a personal grudge. The accusation is that the attackers first rammed his car to knock him down, then laid him on the roof of the car, trapped both his hands in the window glasses and locked them, and drove the car at high speed for one and a half kilometers.
— Siraj Noorani (@sirajnoorani) October 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

