NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
NZvIND: నమన్ ధీర్ స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఛేజింగ్‌లో నమన్ ధీర్ 15 బంతుల్లో 42 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యం లభించింది.
క్రైస్ట్‌చర్చ్: నమన్ ధీర్ స్టన్నింగ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అతను 42 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. 280 స్ట్రయిక్ రేట్‌తో అతను బ్యాటింగ్ చేశాడు. దీంతో కివీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్(NZvIND)లో.. టీమిండియా 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. 226 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విక్టరీ ఖాతాలో వేసుకుని అయిదు మ్యాచ్‌లో సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఆరంభంలో ఊచకోత కోశారు. ఆ ఇద్దరూ తొలి వికెట్‌కు 93 రన్స్ జోడించారు. పవర్‌ప్లేలో సంజూ, అభిషేక్ .. బౌండరీలతో హోరెత్తించారు. అభిషేక్ 12 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 రన్స్ చేశాడు. ఇక శాంసన్ 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 రన్స్ చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను 28 బంతుల్లో 42 రన్స్ స్కోరు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝘾𝙃𝘼𝙎𝙀 🤩
Naman Dhir, take a bow 👏
Scorecard ▶️ https://t.co/ADfFnxXGzz
#TeamIndia | #NZvIND https://t.co/3VcfLDwPQJ
— BCCI (@BCCI) October 22, 2026
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 రన్స్ చేసింది. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. అల్లెన్ 24 బంతుల్లో 45, ఫిలిప్స్ 40 బంతుల్లో 82 రన్స్ చేశారు. టీ20ల్లో స్వదేశీ పిచ్‌పై కివీస్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. దాదాపు నాలుగేళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ దూరంగా ఉన్న భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌లో ఆడాడు. అయితే భువీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అతని ఖాతాలో వికెట్ పడలేదు. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 17 బంతుల్లో 24 రన్స్ చేశాడు. న్యూజిలాండ్ చివరి 30 బంతుల్లో 67 రన్స్ చేసింది. అర్షదీప్, అక్షర్, మయాంక్ యాదవ్‌లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు.
A flying start that made the chase possible 🫡
Scorecard ▶️ https://t.co/ADfFnxXGzz
#TeamIndia | #NZvIND | @IamSanjuSamson https://t.co/qBU50RVhrY
— BCCI (@BCCI) October 22, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

