Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
keerthy Suresh | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) తెరకెక్కించిన క్రైమ్ డ్రామా సిరీస్ ‘అక్క’ (Akka) ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్, టాలెంటెడ్ నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
keerthy Suresh | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) తెరకెక్కించిన క్రైమ్ డ్రామా సిరీస్ ‘అక్క’ (Akka) ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్, టాలెంటెడ్ నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ (YRF Entertainment) నిర్మించిన ఈ సిరీస్‌కు ధర్మరాజ్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు. పూర్తిగా మహిళల చేతుల్లో సాగే ఒక విభిన్న రాజ్యాన్ని, వారి మధ్య జరిగే పవర్ పాలిటిక్స్‌ను ఈ సిరీస్‌లో ఆవిష్కరించనున్నారు. అక్టోబర్ 30 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్ చూస్తుంటే.. పెన్నురు (Pernuru) అనే కల్పిత రాజ్యంలో గత 800 ఏళ్లుగా కేవలం మహిళలదే పూర్తి ఆధిపత్యం. ఇక్కడ కుటుంబాలు, వ్యాపారాలు అన్నీ మహిళల కంట్రోల్లోనే ఉంటాయి. కుటుంబంలో అత్యున్నత అధికారం చెలాయించే మహిళను ‘అక్క’ అని పిలుస్తారు. ప్రేమకు, పెళ్లికి సంబంధించి ఈ సమాజం కొన్ని ప్రత్యేకమైన నిబంధనలను పాటిస్తుంది. అయితే, రుద్ర (రాధికా ఆప్టే) రాకతో ఈ వ్యవస్థలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి. రుద్ర అంచనాలు, ఆమె ఆశయాలు భవాని (కీర్తి సురేష్)తో తీవ్ర ఘర్షణకు దారితీస్తాయి. ఈ ఇద్దరు బలమైన మహిళల మధ్య జరిగే ఆధిపత్య పోరు, వంశాచారాన్ని కాపాడుకునే ప్రయత్నం వంటి అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఈ చిత్రంలో తన్వి అజ్మి, మహేష్ మంజ్రేకర్, అన్షుమన్ పుష్కర్, మోనికా పన్వార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో వస్తున్న ఈ క్రైమ్ డ్రామా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

