Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Amit Shah : రాబోయే 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కబోదన్నారు.
Amit Shah : రాబోయే 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కబోదన్నారు. న్యూఢిల్లీలో గురువారం యమునా నది పునరుద్ధరణ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమిత్ సా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాబోయే 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అధికారం దక్కబోదు. బూత్ స్థాయి కార్యకర్తల దగ్గరి నుంచి ప్రధాని మోదీ వరకు బీజేపీ నేతలు ప్రజలతో మమేకం అయి ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. వోట్ చోరీ ఆరోపణలతో రాహుల్ గాంధీ, ఆయన అనుచరులు దేశంలోని చొరబాటుదారులు, అక్రమ వలసదారులకు మద్దతు ఇస్తున్నారు. వారి ఓటు హక్కును పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని దేశం మొత్తం అర్థం చేసుకుంది.
కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారం చేపట్టేటప్పటికే.. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోయింది. అనేక సందర్భాల్లో కోర్టులు రాహుల్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే అప్పడు న్యాయం అంటారు.. అదే వ్యతిరేకంగా తీర్పు వస్తే కోర్టుల్నే ప్రశ్నిస్తారు. ఈ రకమైన ద్వంద ప్రమాణాలు పని చేయవు. ఢిల్లీ ప్రజల మనసు మార్చబోవు. ఢిల్లీలో 30 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేజ్రీవాల్ ప్రభుత్వాలు పూర్తి వ్యర్థాల్ని యమునా నదిలో వదిలేశారు.
హరియాణా, యూపీ నుంచి కాలుష్య వర్థాలు, కలుషిత నీరు నదిలో కలిసింది. అందుకే హరియాణా, యూపీ ప్రభుత్వాలతో కలిసి ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తోంది. 2029లోపు యమునా నదిని ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. పంజాబ్‌లో ఆప్ పాలనలో డ్రగ్స్ వ్యాపారం బాగా వృద్ధి చెందింది అని అమిత్ షా ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

