వాషింగ్టన్, ఏప్రిల్ 29: భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి(55) అమెరికాలో ఘోరానికి పాల్పడ్డాడు. భార్య శ్వేత (44) కుమారుడిని కాల్చి చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. వాషింగ్టన్లోని న్యూకాజల్లో ఈ నెల 24న ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ దారుణం జరిగిన సమయంలో అతని ఇంకో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ఘటనకు ఎందుకు పాల్పడిందీ కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.