టెహ్రాన్ : ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులు తీవ్రరూపం దాల్చడంతో టెహ్రాన్‌లోని భారతీయ విద్యార్థులను 148 కి.మీ. దూరంలోని కోమ్ నగరానికి తరలిస్తున్నారు.
అంతకుముందు భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో, ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులను ఆ దేశంలోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్లో 1,500కుపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు, వీరిలో అత్యధికులు జమ్ముకశ్మీరుకు చెందినవారు.