Ottawa | కెనడా (Canada)లో భారతీయులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. కెనడా రాజధాని ఒట్టావా (Ottawa) సమీపంలోని రాక్లాండ్ ప్రాంతంలో భారతీయుడిని దుండగుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో సదరు భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్లు కెనడాలోని భారత ఎంబసీ (Indian Embassy) వెల్లడించింది.
ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. అయితే, మృతుడికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. బాధిత కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని మాత్రం పేర్కొంది. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం (కెనడా) శనివారం ఉదయం చోటుచేసుకున్నట్లు కెనడా మీడియా వెల్లడించింది. మరోవైపు తాజా ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
Also Read..
Earthquake | నేపాల్‌లో 5 తీవ్రతతో భూకంపం.. వణికిన ఉత్తరభారతం
Earthquake | పపువా న్యూ గునియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Gold Card | ఇదిగో గోల్డ్ కార్డ్.. ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించిన ట్రంప్