Earthquake | పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూ గునియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) సభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్ (New Britain island)లోని కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దీంతో అమెరికా సునామీ హెచ్చరికలు జారీచేసింది (Tsunami warning Issue).
వారం రోజుల క్రితం మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందుగా గత నెల 28 మధ్యాహ్నం మయన్మార్‌లో నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత కొద్దిసేపటిక థాయ్‌లాండ్‌ను 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో మయన్మార్‌లో 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 4 వేల మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. వందలాది మంది గల్లంతయ్యారు. పలు దేశాల రెస్క్యూ సిబ్బంది సహాయచర్యలు కొనసాగిస్తున్నారు.
Also Read..
Earthquake | నేపాల్‌లో 5 తీవ్రతతో భూకంపం.. వణికిన ఉత్తరభారతం
Gold Card | ఇదిగో గోల్డ్ కార్డ్.. ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించిన ట్రంప్
బంగ్లాలో మైనారిటీలకు రక్షణ కల్పించండి.. యూనస్‌కు మోదీ సూచన