గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 23, 2020 , 07:11:25

భారత సంతతి నర్సుకు.. సింగపూర్‌ ప్రెసిడెంట్‌ అవార్డు

భారత సంతతి నర్సుకు.. సింగపూర్‌ ప్రెసిడెంట్‌ అవార్డు

సింగపూర్‌: సింగపూర్‌లో నర్సుగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన మహిళ కళా నారాయణస్వామి (59)కి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక సింగపూర్‌ ప్రెసిడెంట్‌ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ఈ మేరకు ఈ దేశ ఆరోగ్య శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొవిడ్‌-19 సోకిన రోగులకు చేసిన సేవలకు గానూ ఈ అవార్డు ఆమెను వరించింది. పురస్కారంలో భాగంగా ట్రోఫీ, సర్టిఫికేట్‌తో పాటు 10 వేల సింగపూర్‌ డాలర్లను ఇవ్వనున్నారు.logo