అప్రమత్తంగా ఉండండి భారత పౌరులకు అడ్వైజరీ
భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్, ఇరాన్‌లోని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరీ జారీ చేశాయి. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని, ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలని సూచించాయి.
టెహ్రాన్: భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్, ఇరాన్‌లోని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరీ జారీ చేశాయి. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని, ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలని సూచించాయి.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే టెల్అవీవ్ భారత రాయబార కార్యాలయం అధికారులను +972-54-7520711 ఫోన్ నంబర్లో లేదా cons1. telaviv @mea.gov.in ఈమెయిల్ ఐడీలో సంప్రదించాలని తెలిపాయి. పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటం వల్ల అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అబుదాబి, యూఏఈ, సౌదీ, జోర్డాన్ తదితర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అక్కడ ఉన్న భారతీయులకు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశాయి. మరోవైపు సంయమనం పాటిస్తూ దౌత్యపరమైన చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని భారత విదేశాంగ శాఖ ఇరాన్, ఇజ్రాయెల్‌కు సూచించింది.
ఈజిప్ట్, జోర్డాన్ మీదుగా తరలింపు
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను ఈజిప్ట్ లేదా జోర్డాన్ మీదుగా తరలించే అవకాశముందని ఇజ్రాయెల్‌లో భారత రాయబారి జేపీ సింగ్ మీడియాకు తెలిపారు. సమయం రాగానే సంబంధిత ప్లాన్ వెంటనే అమలుజేస్తామని అన్నారు. రోడ్డు మార్గంలో భారతీయుల తరలింపునకు పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పారు. స్థానిక అధికార యంత్రాంగం సూచనలు పాటించాల్సిందిగా భారత పౌరులకు ఇజ్రాయెల్‌లోని ఎంబసీ సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

