Indian | మసాజ్ పేరుతో మహిళలపై భారతీయుడి వేధింపులు.. ఆస్ట్రేలియాలో 13 ఏళ్ల జైలు శిక్ష
Indian : మసాజ్ పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారతీయ సంతతి వ్యక్తికి ఆస్ట్రేలియాలోని కోర్టు భారీ శిక్ష విధించింది. 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది.
Indian : మసాజ్ పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారతీయ సంతతి వ్యక్తికి ఆస్ట్రేలియాలోని కోర్టు భారీ శిక్ష విధించింది. 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. నిందితుడు సుమిత్ సతీష్ రస్తోగి (39) మహిళల్ని వేధించినట్లు కోర్టు గుర్తించడంతో అతడికి ఈ శిక్ష వేసింది. ఒక అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. న్యూఢిల్లీకి చెందిన సుమిత్ 2011లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ అడిలైడ్ సిటీలోని గ్లెన్లెగ్లో ఒక మసాజ్ పార్లర్ నడుపుతున్నాడు.
ఈ క్రమంలో 2021, అక్టోబర్ నుంచి 2022 జూలై వరకు.. అంటే ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపు 61 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మసాజ్ చేయించుకుంటున్న వారిని అసభ్యంగా వీడియోలు తీయడం, అసభ్యంగా తాకడం వంటి 97 నేరాలకు పాల్పడ్డారు. ఇతడి వేధింపులకు గురైన బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుమిత్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని జూలై, 2022లో అరెస్టు చేశారు. ఇంతకాలం ఈ కేసు విచారణ కొనసాగింది. విచారణలో అతడు నేరం చేసినట్లు రుజువైంది. సుమిత్ వేధింపులకు గురైన మహిళలు తీవ్ర మనో వేధనకు గురైనట్లు కోర్టు గుర్తించింది.
అతడి నేరాలకుగాను కోర్టు 13 సంవత్సరాల 10 నెలలపాటు జైలు శిక్ష విధించింది. ఇందులో పదేళ్ల, పది నెలలపాటు పెరోల్ పొందడానికి కూడా వీలు లేకుండా కోర్టు తీర్పునిచ్చింది. అంటే, 2035 వరకు అతడికి పెరోల్ లభించదు. ఇప్పటికే కొంతకాలం నుంచి అతడు జైలులో ఉన్నందున ఆ కాలాన్ని కూడా శిక్షగా పరిగణిస్తారు. ఈ జైలు శిక్ష కాలాన్ని పరిగణనలోకి తీసుకుని 2035లోనే పెరోల్ లభిస్తుంది. ఇక, సుమిత్ తన పూర్తి శిక్ష అనుభవించిన అనంతరం అతడిని ఆస్ట్రేలియా నుంచి తిరిగి ఇండియా పంపేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

