ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. టెహ్రాన్ చేరుకున్న భారత్ బృందం
అమెరికా-ఇరాన్ యుద్ధం తొలిరోజే దివంగతుడైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ శుక్రవారం ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజుల తరబడి జరిగే అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్కు మద్దతుగా ప్రజలంతా ఏకం కావాలని కోరుతూ రాజధాని టెహ్రాన్ అంతటా బ్యానర్లు వెలిశాయి.
- లక్షలాదిగా పౌరులు పోటెత్తాలని ఇరాన్ పిలుపు
టెహ్రాన్, జూలై 3: అమెరికా-ఇరాన్ యుద్ధం తొలిరోజే దివంగతుడైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ శుక్రవారం ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజుల తరబడి జరిగే అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్కు మద్దతుగా ప్రజలంతా ఏకం కావాలని కోరుతూ రాజధాని టెహ్రాన్ అంతటా బ్యానర్లు వెలిశాయి. 1989లో సుప్రీం లీడర్ అయతొల్లా రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియలకు దీటుగా రాజధాని వీధుల్లోకి లక్షలాది మంది ప్రజలు పోటెత్తాలని ఇరాన్ పాలకులు కోరుతున్నారు. అలా చేస్తే తమ ప్రభుత్వానికి ఎంతో శక్తినిచ్చినట్టు అవుతుందని ఇరాన్ ఒక విధంగా అగ్రరాజ్యం అమెరికా ముందు బలప్రదర్శన జరపాలని పాలకులు అనుకుంటున్నారు.
ప్రజాబలం, పాలకులకు వారి ఇచ్చే మద్దతును తెలియజేయడం ద్వారా భవిష్యత్‌లో ఇజ్రాయెల్ నుంచి దాడుల విషయంలో రక్షణ, హొర్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు, అమెరికాతో యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు జరిగే చర్చల్లో నైతికంగా బలం చేకూరుతుందని ఇరాన్ భావిస్తున్నది. కాగా, యుద్ధం ప్రారంభమైన కొన్ని నెలల తర్వాత ఇరాన్ పారా మిలిటరీ రివల్యూషనరీ గార్డుకు చెందిన ఒక శక్తిమంతమైన జనరల్ బహిరంగంగా ఈ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరవుతారని తెలిసింది. అలాగే ఇరాన్ శక్తిని ప్రపంచ దేశాలకు చాటేందుకు మరికొందరు ముఖ్యమైన నేతలు, అధికారులు కూడా విదేశీ ప్రతినిధులతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిసింది.
భారత్ నుంచి హాజరవుతున్నది వీరే
ఖమేనీ అంత్యక్రియల్లో హాజరయ్యేందుకు భారత్ నుంచి బయలుదేరిన అధికారిక బృందం టెహ్రాన్‌కు చేరుకుంది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అత్-షస్నైన్లు భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. వీరితో పాటు భారత్‌కు చెందిన మతపెద్దలతో కూడిన బృందం కూడా ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు చేసిందని స్థానిక మీడియా పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

