Nepal | ముంబై, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నేపాల్లో శుక్రవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. 41 మంది భారత యాత్రికులతో వెళ్తున్న బస్సు నదిలోకి పడటంతో మహారాష్ట్రకు చెందిన 27 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బస్సు తనాహున్ జిల్లా ముగ్లింగ్ సమీపంలో కొండల ప్రాంతంలో వెళ్తుండగా అదుపు తప్పి పక్క లోయలోని మర్త్యంగడి నదిలోకి బోల్తా కొట్టింది.
దైవ దర్శనం కోసం వెళ్తుండగా..
భుసావల్ గ్రామానికి చెందిన 104 మంది బృందం దైవదర్శనం కోసం రెండు రోజుల క్రితం నేపాల్ వెళ్లింది. ప్రమాదంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.