చైనా సరిహద్దులో హైస్పీడ్ బోట్లతో గస్తీకి సిద్ధమైన భారత సైన్యం

న్యూఢిల్లీ : చైనా సైన్యంతో ఘర్షణ నేపథ్యంలో చైనా సరిహద్దులో హైస్పీడ్ బోట్లతో గస్తీ చేపట్టేందుకు భారత సైన్యం సిద్ధమైంది. మే నెలకల్లా ఇండియన్ ఆర్మీ 12 హైస్పీడ్ బోట్లతో గస్తీ కాయనున్నది. ఈ మేరకు మెస్సర్స్ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. చైనా సరిహద్దులోని పాంగాంగ్ ట్సో సరస్సుతోపాటు ఇతర పెద్ద నీటి వనరుల నుంచి పర్యవేక్షించడానికి భారత సైన్యం డజను కొత్త హైస్పీడ్ బోట్లను సేకరించనున్నది. దేశీయంగా తయారైన పడవలు మే నాటికి అందుబాటులోకి వస్తాయి.
చైనా ఆర్మీకి ఓడల బలం చాలా ఉన్నది. వారు సరిహద్దుల్లో బోట్లతో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. వారికి ధీటుగా భారత సైన్యం తయారయ్యేందుకు అధిక శక్తి, సామర్ధ్యంతో కూడిన బోట్లను సమకూర్చుకోవాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం భారత సైన్యంలో దాదాపు 17 పడవలు ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని అవసరం కావడంతో మెస్సర్స్ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. పాంగాంగ్ ట్సో సరస్సు చైనా నియంత్రణలో ఉన్నది. ఈ సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్న ప్రాంతాలను చైనా దళాలు ఆక్రమించాయి. దీనికి ప్రతిస్పందనగా, భారత సైన్యం సరస్సు దక్షిణ భాగంలో ఎత్తుల్లో మోహరించింది. అయితే పాంగాంగ్ ట్సో సరస్సులో పెట్రోలింగ్ నిర్వహించడం భారత ఆర్మీకి కత్తిమీది సాములా తయారవడంతో.. సైన్యం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు డజన్ పెట్రోలింగ్ పడవలను ఆర్మీకి అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది.
దేశీయంగా నిర్మించిన బలమైన పడవలు మెరుగైన యాంటీ ర్యామింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అదనపు దళాలను తరలించడానికి ఉపయోగపడతాయి. 24 ఫాస్ట్ పెట్రోలింగ్ పడవలు ఉండాల్సిన అవసరం ఉండగా, ప్రారంభంలో 12 మాత్రమే ఆర్డర్ చేస్తున్నారు. "ఎత్తైన ప్రదేశాలతో పాటు పెద్ద నీటి వనరుల పర్యవేక్షణ, పెట్రోలింగ్ కోసం 12 ఫాస్ట్ పెట్రోలింగ్ బోట్ల కోసం భారత సైన్యం మెస్సర్స్ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. 2021 మే నెల నుండి సరఫరా ప్రారంభమవుతుంది" అని భారత సైన్యం ఒక ట్వీట్లో తెలిపింది.
పాంగాంగ్ ట్సో సరస్సులో పెట్రోలింగ్ చేయడానికి ఉపయోగించే పడవలను అప్‌గ్రేడ్ చేయవలసిన అవసరాన్ని గల్వాన్‌లో చైనా దళాలతో ఘర్షణ సమయంలో భారత్ గుర్తించింది. పాంగాంగ్ సరస్సులో, ఒడ్డున చైనా చొరబాట్లు పెరగడంతో ఘర్షణలు మొదలయ్యాయి. వివాదాస్పద పాంగాంగ్ ట్సో సరస్సు 134 కిలోమీటర్ల పొడవుగా ఉండి.. మూడింట రెండొంతులు చైనా నియంత్రణలో ఉన్నది. సరస్సు యొక్క 45 కిలోమీటర్ల పొడవు సరిహద్దు మాత్రమే భారత్ ఆధీనంలో ఉన్నది.
ఇవి కూడా చదవండి..
మనకు ఆనందం.. వాటికి ప్రాణసంకటం
పాములతో బాడీ మసాజ్.. ఎక్కడైనా చూశారా?!
ప్రేక్షకులు లేకుండా భారత్- ఆసీస్ థర్డ్ టెస్ట్
ఈరోజు సూర్యుడికి దగ్గరగా వెళ్లనున్న భూమి
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన
- రా రమ్మంటాయి..ఆనందాన్నిస్తాయి
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్‌కు బెదిరింపు కాల్స్..!
- అమెరికా అధ్యక్షుడు ఫాలో అవుతున్న ఆ ఏకైక సెలబ్రిటీ ఎవరో తెలుసా?
- బైడెన్‌కు ఆ "బిస్కెట్" ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- ఎస్బీఐ పీఓ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్‌కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క