ఇస్లామాబాద్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరోసారి అసందర్భ ప్రేలాపనలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలో తప్ప భారతదేశం ఎన్నడూ ఐక్యంగా లేదంటూ ఆయన నిరాధార వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా పాకిస్థాన్‌కు చెందిన సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జోస్యం చెప్పారు.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలను పాక్ నిలిపివేయాలని, లేనిపక్షంలో ప్రపంచ పటం నుంచి పాక్‌ను తుడిచివేస్తామని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో ఖ్వాజా ఆసిఫ్ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పూనుకోవడం గమనార్హం. మరోవైపు అమెరికా నుంచి పాకిస్థాన్ ఏఐఎమ్-120 గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక మధ్య-శ్రేణి క్షిపణులను(అమ్రామ్) కొనుగోలు చేయనుంది.