Unsafe Roads | జోహెన్నస్‌బర్గ్: వాహనాల డ్రైవర్లకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా దక్షిణాఫ్రికా వరుసగా రెండవ ఏడాది జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 53 దేశాలలో పరిశోధన చేసిన అమెరికాకు చెందిన డ్రైవర్ ట్రైనింగ్ కంపెనీ తాజా జాబితాను విడుదల చేసింది. డ్రైవర్లకు అత్యంత ప్రమాదకరమైన, సురక్షితం కాని దేశాల జాబితాలో భారత్ 5వ స్థానాన్ని దక్కించుకుంది.
అమెరికా భారత్‌ను మించిపోయి 3వ స్థానాన్ని సాధించినట్లు డ్రైవింగ్ కోర్సులను నిర్వహిస్తున్న అంతర్జాతీయ డ్రైవర్ల శిక్షణ కంపెనీ జుటోబీ.కాం వెల్లడించింది. ప్రపంచంలో డ్రైవర్లకు అత్యంత సురక్షిత దేశంగా వరుసగా నాలుగో ఏడాది నార్వే నిలిచింది. సురక్షితం కాని దేశాలలో దక్షిణాఫ్రికా అగ్ర స్థానంలో ఉంది. వాహనాల వేగం, డ్రైవర్లకు బ్లడ్ ఆల్కహాల్ కాన్సెంట్రేషన్ లిమిట్స్, రోడ్డు ట్రాఫిక్ మరణాల సంఖ్య తదితర సూచికల ఆధారంగా జుటోబీ.కాం ర్యాంకింగ్‌లు ఇస్తోంది.