India vs Pakistan |నరమేధ చర్యలకు పాల్పడే పాకిస్తాన్.. భారత్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది!
India vs Pakistan | అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ (Pakistan) కు మళ్లీ భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) లో భారత్ (India) పై నిందలు మోపేందుకు పాకిస్థాన్ (Pakistan) ప్రయత్నించింది. అయితే భారత్ ఆ ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
India vs Pakistan : అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ (Pakistan) కు మళ్లీ భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) లో భారత్ (India) పై నిందలు మోపేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. అయితే భారత్ ఆ ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సాయుధ ఘర్షణల్లో పౌరులకు రక్షణ కల్పించే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో గురువారం బహిరంగ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాక్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అంశాన్ని ప్రస్తావించారు.
పాకిస్థాన్ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గట్టిగా తిప్పికొట్టారు. నరమేధ చర్యలకు పాల్పడే దేశం.. భారత అంతర్గత విషయాల గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన దాడుల గురించి హరీష్ ప్రస్తావించారు. పవిత్ర రంజాన్ మాసంలో కాబుల్‌లోని ఓ ఆస్పత్రిపై జరిగిన దాడిని ప్రపంచం ఇంకా మరిచిపోలేదన్నారు. ఈ అమానుషమైన హింసాకాండలో 269 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 122 మంది గాయపడినట్లు తెలిపారు.
చీకట్లో అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ.. అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడటం పాకిస్థాన్ కపటత్వానికి నిదర్శనమని విమర్శించారు. తన సొంత ప్రజలపైనే బాంబులు వేస్తూ.. జాతి నిర్మూలనకు పాల్పడే దేశం ఇలాంటి దురాక్రమణ చర్యలకు పాల్పడటంలో పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

