Temperatures | లండన్: విమానాల నుంచి వెలువడే పొగ మేఘాలు ఆకాశంలో దుప్పటి మాదిరిగా పని చేస్తాయని, ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు హెచ్చరించారు. ఈ మేఘాలను తగ్గిస్తే, భూమి వేడెక్కడంలో వైమానిక రంగం చూపే ప్రభావం 40 శాతం తగ్గుతుందని చెప్పారు. చల్లని, తేమ గల గగనతలంలో విమానాలు ప్రయాణించినపుడు నిరంతరాయమైన మేఘం కమ్ముకుంటుందన్నారు. దీనిని నివారించడం కోసం విమానాలు తమ మార్గాలను మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ఐదేండ్లలో చేపట్టాల్సిన చర్యలను తాము సిఫారసు చేశామని, వీటి ప్రభావాన్ని పరీక్షించడం కోసం వైమానిక పరిశ్రమ కృషి చేయాలనిపరిశోధకుల సంయుక్త నివేదిక కోరింది.