న్యూఢిల్లీ : దోపిడీ దొంగలు పట్టపగలు ఓ మహిళ నుంచి విలువైన వస్తువులను దోచుకునేందుకు ప్రయత్నిస్తుండగా 76 ఏండ్ల వృద్ధురాలు వాకింగ్ స్టిక్‌తో వారికి చుక్కలు చూపింది. అమెరికాలోని కాలిఫోర్నియా ఓక్‌ల్యాండ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుడ్‌న్యూస్ కరస్పాండెంట్ ఈ షార్ట్ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది.
OAKLAND, CA– 76-yr-old Miss Faye ran out with her cane to save her neighbor, another senior citizen, from getting robbed in broad daylight last week. Ms. Faye even called for her German shepherd Troy to help apprehend the subject.
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 26, 2022
తన పొరుగున ఉన్న మహిళను దోపిడీ దొంగల బారి నుంచి కాపాడేందుకు ఫయే అనే వృద్ధురాలు వాకింగ్ స్టిక్‌తో వెంబడించగా దుండగులు వెన్నుచూపారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 6,000 మందికి పైగా వీక్షించగా దోపిడీ నుంచి తోటి మహిళను కాపాడేందుకు ఫయే చూపిన చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఫయే రెబెల్ అని ఆమె చేసిన పని తమకు ఆశ్చర్యం కలిగించలేదని ఆమె పొరుగింటి వ్యక్తి చెప్పుకొచ్చారు. సమయానుకూలంగా స్పందించన బామ్మ ధైర్య సాహసాలను నెటిజన్లు మెచ్చుకున్నారు. ఫయేకు సహకరించేందుకు పెంపుడు కుక్క సైతం పరుగులు పెట్టడంతో దుండగులు పరారయ్యారని మరికొందరు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.