జెరూసలేం, డిసెంబర్ 28: అమెరికా అందజేసిన క్షిపణి రక్షణ వ్యవస్థ ‘థాడ్’ (ద అమెరికన్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్)ను ఇజ్రాయెల్ మొదటిసారిగా ఉపయోగించింది. శనివారం యెమెన్‌లోని ‘హౌతీ’ తిరుగుబాటు దళాలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని ‘థాడ్’తో అడ్డుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించి ‘ఎక్స్’లో వీడియో విడుదలైంది. కాసేపటి తర్వాత..‘థాడ్’ను ఉపయోగించినట్టు ‘ఐడీఎఫ్’ నిర్ధారించింది.
ఇరాన్ క్షిపణి దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ ‘థాడ్’ను ఏర్పాటు చేసింది. స్వల్ప, మధ్య, మధ్యంతర శ్రేణి క్షిపణి దాడుల్ని అడ్డుకునేందుకు అమెరికా ‘థాడ్’ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా తమ మిత్ర దేశాలకు అందజేస్తున్నది. అణుబాంబు సహా శక్తివంతమైన బాంబులతో దూసుకొచ్చే క్షిపణుల్ని 870 నుంచి 3,000 కిలోమీటర్ల పరిధిలోనే ‘థాడ్’ రాడార్లు గుర్తిస్తాయి.