పెషావర్, డిసెంబరు 26: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతున్నది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బునేర్ జిల్లాలోని జనరల్ స్థానమైన పీకే-25 నుంచి డాక్టర్ సవీరా పర్కార్ పోటీ చేస్తున్నారు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
రిటైర్డ్ డాక్టర్ అయిన సవీరా తండ్రి ఓం పర్కాశ్ 35 ఏళ్లుగా పీపీపీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. సవీరా అబోటాబాద్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందారు. ఆమె బునేర్ పీపీపీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పేదల కోసం పనిచేస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు.