Imran Khan | ఇమ్రాన్ ఖాన్ అరెస్టయిన 9 నెలల తర్వాత ఈ నెల 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. ఎన్నికలకు ఐదు రోజుల ముందు మూడు వేర్వేరు కేసుల్లో 31 ఏండ్ల పాటు జైలు శిక్ష పడింది. పాకిస్థాన్ ఎన్నికల సంఘం కూడా ఖాన్ ఎన్నికల చిహ్నం బ్యాట్‌ను రద్దు చేసింది. ఇమ్రాన్ ప్రచారం చేయకూడదంటూ నిషేధం విధించింది. ప్రజల మనసుల్లోంచి ఇమ్రాన్ ఖాన్‌ను చెరిపివేయడానికి సైన్యం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంది. అయితే ఇంత జరిగినా ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇమ్రాన్‌కు మద్దతిస్తున్న స్వతంత్ర అభ్యర్థులలో 93 మందిని గెలిపించారు. ఈ ఫలితాలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. పాకిస్థాన్ ఎన్నికల సంఘం 67 గంటల ఆలస్యంతో ఫలితాలను వెల్లడించింది. క్రికెట్ ఆడే కుర్రాడు… జైలు నుంచే ఎన్నికల్లో గెలుపొందేంతగా రాజకీయాల్లో ఎలా పాపులర్ అయ్యాడు? ఖాన్ రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు? మొదట సైన్యం ఇష్టపడ్డ వ్యక్తి, ఆ తరువాత సైన్యానికి అతిపెద్ద శత్రువుగా ఎలా మారాడవే ముఖ్యమైన విషయాలు. ముందుగా ఇమ్రాన్ గెలుపుకు రెండు కారణాలేంటో తెలుసుకుందాం.
జియో న్యూస్ ప్రకారం, ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్‌కు ఒక దాని తర్వాత ఒక శిక్ష విధించారు. ఆఖరుకు ఆయన వివాహాన్ని కూడా చట్టవిరుద్ధమని ప్రకటించారు. దీంతో పాకిస్థాన్ ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరిగింది. ఒక సర్వే ప్రకారం ఇమ్రాన్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన పార్టీకి ప్రజా మద్దతు పెరిగింది. జైలుకు వెళ్లిన తర్వాత, ఖాన్ ఏదో ఒక విధంగా ప్రజలతో సన్నిహితంగా ఉండేవారు. జైలు నుంచి సందేశాలు పంపడంతో ఆయన మరింత ప్రజా మద్దతు కూడగట్టటంలో విజయం సాధించారు. సైన్యంతో పాటు అమెరికా జోక్యం వల్లే తన ప్రభుత్వం పడిపోయిందని ప్రజల్లో ప్రచారం చేసుకున్నారు. ప్రజలు ఆ మాటలు నమ్మడంతో మరింత సానుభూతి పెరిగింది. దాంతో ఎన్నికల్లో ఆయనకు మద్దతు పలికారు.
నాలుగేండ్ల తర్వాత నవాజ్ షరీఫ్, ఎన్నికల జరగటానికి ముందు కేవలం 4 నెలల ముందు పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, పాకిస్తాన్ కు తిరిగి వచ్చిన తర్వాత కూడా, నవాజ్ షరీఫ్ ఎటువంటి ర్యాలీలు నిర్వహించలేదు. ప్రజల్లోకి వెళ్లలేదు. నవాజ్ పాకిస్తాన్ లో లేని సమయంలో,అతన్ని అవినీతి పరుడుగా, అతని ప్రతిష్టను దిగజార్చడంలో ఇమ్రాన్ విజయం సాధించారు. ఇమ్రాన్ జైలులో ఉన్నప్పటికీ, నవాజ్ జేలు బయట ఉన్నప్పటికీ, ప్రజలు పీటీఐకి మద్దతిస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేయడానికి ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు.
ముషారఫ్‌కు మరణశిక్ష విధించాలని ఇమ్రాన్ డిమాండ్ చేశారు. కానీ ముషారఫ్ తర్వాత పరారయ్యాడు. ఇమ్రాన్ ఖాన్ కెరీర్లో రెండు సంఘటనలు అతని జీవితంలో అతిపెద్ద మలుపులుగా చెప్పవచ్చు. మొదటిది- 1992 క్రికెట్ ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ విజయం . రెండవది 1996లో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీని రెండవసారి ఏర్పాటు చేయడం.
క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ తొలి ఆల్ రౌండర్ ఇమ్రాన్. 1987లో, అతను భారత్‌లో పాకిస్థాన్‌ను తొలి టెస్టు సిరీస్‌ని గెలిపించాడు. ఆ సమయంలో, పాకిస్తాన్ నియంత జియా-ఉల్-హక్ ఖాన్‌ను పాకిస్తాన్ ముస్లిం లీగ్ (PML)లో చేరమని ఆహ్వానించాడు. అయితే ఈ ప్రతిపాదనను ఇమ్రాన్ తిరస్కరించారు. ఆ తర్వాత 1996లో ఇమ్రాన్ తన సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)ని స్థాపించారు. అప్పుడు కేవలం 7 స్థానాల్లో మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన, ఘోర పరాజయాన్ని చవిచూసారు. అయితే, క్రమంగా ఇమ్రాన్ రాజకీయ అనుభవం,పార్టీ క్యాడర్ రెండూ పెరిగాయి. 1999లో కార్గిల్ యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత జనరల్ పర్వేజ్ ముషారఫ్, అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను గద్దె దించారు.
ఆ సమయంలో ఇమ్రాన్ సైన్యం చేసిన తిరుగుబాటుకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. కానీ 2002 నాటికి అతను ముషారఫ్‌కు ప్రత్యర్థిగా మారాడు. ఇమ్రాన్ పార్టీ మరోసారి ఎన్నికల బరిలోకి దిగినా 272 సీట్లలో కేవలం ఒకే ఒక్క సీటును గెలవగలగింది. 2007 నవంబర్ 3న అధ్యక్షుడు ముషారఫ్ పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ విధించాడు. ముషారఫ్‌కు మరణశిక్ష విధించాలని ఇమ్రాన్ డిమాండ్ చేశాడు.. ఆ తర్వాత అతన్ని గృహనిర్బంధంలో ఉంచారు, కానీ అతను తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఘాజీ ఖాన్ జైలులో ఉంచారు. అయితే నవంబర్ 21న ఇతర రాజకీయ ఖైదీలతో పాటు ఇమ్రాన్ కూడా విడుదలయ్యాడు.
సైన్యాన్ని ప్రసన్నం చేసుకుని ఇమ్రాన్ ప్రధాని అయ్యారు.
పాకిస్తాన్ ప్రజలచే కాదు జనరల్స్ చేత నడుపబడుతుందని, కొంతమంది సైనిక అధికారులు పాకిస్తాన్ ఎన్నికలను తారుమారు చేస్తారని , సైన్యంలోని అధికారులు ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపుతారని పాకిస్తానీ జర్నలిస్టు అతికా రెహ్మాన్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ సైన్యంలోని అధికారులే అక్కడి అణు విధానంతో పాటు విదేశాంగ విధానాన్ని కూడా నిర్ణయిస్తారు. పాకిస్తాన్ లో ప్రధానమంత్రి తన పదవి కాపాడుకోవాలంటే అక్కడి సైన్యాన్ని సంతోషంగా ఉంచాలి. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు సైన్యమే తన పదవిని ఊడగొట్టిందని ఆరోపించవచ్చు. కానీ ఆ సైన్యం మద్దతుతోనే ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
2018లో పాకిస్తాన్ సైన్యం అక్కడ ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ , పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, వారసత్వ రాజకీయాలు లేని పార్టీ కోసం వెతుకింది. భుట్టో కుటుంబం చేతిలో పీపీపీ, నవాజ్ షరీఫ్ కుటుంబం చేతిలో పీఎంఎల్-ఎన్ ఉన్నాయి. దాంతో వాటిని నియంత్రించడం సైన్యానికి కష్టంగా మారింది. అప్పుడు సైన్యం మరో ప్రముఖ వ్యక్తిని అధికారంలోకి తేవాలని భావించింది. అప్పుడు ఆ రెండు పార్టీలను అధికారం నుండి తప్పించి, తమకు అనుకూలమైన వ్యక్తిని అధికారంలోకి తేవాలనుకున్న పాకిస్తాన్ సైన్యం చూపు ఖాన్ పై పడింది. కికెట్ అంటే పడి చచ్చే పాకిస్థాన్ కు 1992 లో ప్రపంచకప్ సాధించి పెట్టి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు ఇమ్రాన్ ఖాన్. ఆక్స్ ఫర్డ్ లో చదువుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఇమ్రాన్ ఖాన్ లాహోర్‌లోని ఆసుపత్రులకు, విశ్వవిద్యాలయాలకు నిధులు ఇస్తుండే వాడు. ఆ తరువాత ఖాన్‌కు రాజకీయాలపై ఆసక్తి కలిగి 1996లో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పేరుతో సొంత పార్టీని స్థాపించాడు.
పాకిస్తాన్ అభివృధ్ధి వై ఇమ్రాన్ వైఖరితో పాటు ఇస్లాం పట్ల అతని అభిప్రాయాలు పాకిస్తాన్ సైన్యం దృష్టిలో ఖాన్ ఇమేజ్‌ని మరింత పెంచాయి. ఖాన్ ఉర్దూ తో పాటు ఇంగ్లీషులో ప్రసంగాలు చేస్తూ పాకిస్తాన్‌ను గొప్పగా మార్చాలనే కలను ప్రజలకు చెప్పేవాడు. పాకిస్తాన్ రాజకీయ విశ్లేకులు, వ్యాఖ్యాత సిరిల్ అల్మేడా ప్రకారం, సైన్యం 20 ఏండ్ల పాటు, రెండు ప్రధాన రాజకీయ పార్టీలపైన పాకిస్తాన్ ప్రజల్లో ద్వేషాన్ని నింపింది.
పాకిస్థాన్ ప్రజల్లో తనకు బలమైన ఫాలోయింగ్ ఉందని చెబుతూనే, తనను అధికారంలోకి తీసుకురావడం వెనుక సైన్యం ఉందని ఇమ్రాన్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. 2018లో అధికారంలోకి వచ్చిన తరువాత, అతను పాకిస్తాన్ యొక్క ప్రధాన సమస్యలపై స్వంతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాడు. ఇమ్రాన్ మొదటిసారి ప్రధాని పదవి చేపట్టినా, కొన్ని విషయాల్లో అతిగా వ్యవహరించారని పాక్ జర్నలిస్ట్ సిరిల్ అల్మెయిడా ఆరోపించారు. మూడేళ్ల పాలన తర్వాత కూడా ఇమ్రాన్ మిలిటరీని జూనియర్ భాగస్వామిగా భావించారు. ఆయన పలు నిర్ణయాల్లో సైన్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు కనిపించాయి. 2019లో, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా పదవీకాలాన్ని పొడిగించకుండా ఉండేందుకు ఇమ్రాన్ తీవ్రంగా ప్రయత్నించి అందులో విఫలమయ్యారు.
అదేవిధంగా, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్‌గా బజ్వాకు ఇష్టమైన జనరల్ నదీమ్ అంజుమ్‌ను నియమించడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడానికి ప్రయత్నించాడు. ఇమ్రాన్ బజ్వా రిటైర్ కాగానే ఆయన స్థానంలో ISI చీఫ్ ఫైజ్ హమీద్‌ను ఆర్మీ చీఫ్ అవ్వాలని కార్ప్స్ కమాండర్‌గా పెషావర్‌కు పంపాడు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ పరిపాలనా పరంగా కొన్ని వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిరంతరం తగ్గుతుండటంతో ఇమ్రాన్ ఖాన్ ఐఎంఎఫ్ నుండి రుణం తీసుకోవాలనే ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. ఐఎంఎఫ్ నుండి రుణం తీసుకోవడం తలవంచడమేనని అన్నారు. అవసరమైతా ప్రాణాలిస్తామని, కాని ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకోనని చెప్పారు. కానీ 9 నెలల తర్వాత అతను ఐఎంఎఫ్ నుండి మొదటి విడత రుణాన్ని తీసుకోవాల్సి వచ్చింది.
ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, పాకిస్తాన్ జీడీపీ 2018లో 315 బిలియన్ డాలర్లు కాగా, అది 2022లో 264 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ద్రవ్యోల్బణం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఫిబ్రవరి 2022లో, టోకు ద్రవ్యోల్బణం 12.2%కి మరియు టోకు ద్రవ్యోల్బణం 23.6%కి చేరుకుంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్లో అవినీతి మరింత పెరిగిపోయింది. 180 అత్యంత అవినీతి దేశాల జాబితాలో 2021లో 140వ స్థానానికి చేరుకుంది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశంగా 180వ స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్ 2018లో 117, 2019లో 120, 2020లో 124 దేశంగా పాకిస్తాన్ నిలిచింది.
ర్యాలీపై దాడి జరిగిన తరువాత ఇమ్రాన్ ఖాన్‌ను 2022 నవంబర్ 3న అతికా ఇంటర్వ్యూ చేశారు. కానీ ఆ సమయంలోఇమ్రాన్ ఖాన్ తను కాఫీ తెప్పించుకు తాగాడు కానీ, కనీసం ఇంటర్యూ చేస్తున్న జర్నలిస్టుకు కాఫీ తాగమని ఆఫర్ కూడా చేయలేదు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా దాదాపు 4 నెలల తరువాత, ది ప్రాస్పెక్ట్ అనే పత్రికలో ప్రచురితమైన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. 2018లో ఖాన్ పాకిస్థాన్‌లో అధికారంలోకి వచ్చినప్పుడు, అతనితో క్రికెట్ ఆడిన భారత ఆటగాడు అన్షుమాన్ గైక్వాడ్ కూడా ఇమ్రాన్ ఖాన్ అహంకారి అని చెప్పాడు. ఆయన ఇతర వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటాడని కూడా చెప్పాడు.
పాకిస్తాన్ దౌత్యవేత్త మలీహా లోధీ, ది స్టేట్స్ మెన్ పత్రికలో ఇమ్రాన్ ఖాన్ అహంకారమే 2022లో అతని ప్రభుత్వం పతనానికి అసలు కారణమయ్యిందన్నారు. ఇమ్రాన్ అధికారంలోకి వచ్చినప్పుడు, అతనికి సైన్యం పూర్తి మద్దతు పలికిందని, ఆ తరువాత ప్రజల్లో అతని ఇమేజ్ బాగా ఉండేదని, అత్యధిక జనాభా కలిగిన పంజాబ్‌లో అతని పార్టీకి బలం ఉండేదని ఆమె పేర్కొన్నారు.
ఇమ్రాన్ అధికారాన్ని కోల్పోవడానికి రెండు కారణాలని `ది ఇండిపెండెంట్` పాకిస్థానీ జర్నలిస్టు ముర్తాజా అలీ షా కూడా అభిప్రాయపడ్డారు. అహంకారంతో పాటు అసమర్థత ఆ రెండు కారణాలని ముర్తాజా అలీషా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత, ఇమ్రాన్ మొదట తన విమర్శకులను జైలులో పెట్టడం ప్రారంభించారని ముర్తజా రాశారు. చాలా మంది జర్నలిస్టుల ఉద్యోగాలను ఊడగొట్టారని, ఇమ్రాన్ ఖాన్ విమర్శలను ఏమాత్రం సహించడని తెలిపారు.
రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఇమ్రాన్ అహంకారం వల్ల విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. ఆటగాడిగా ఇమ్రాన్ ఇమేజ్ ప్లేబాయ్‌గా ఉండేది. 1995లో 43 ఏండ్ల వయస్సులో, 21 ఏండ్ల జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నాడు, కానీ వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. వారిద్దరు 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత, జర్నలిస్ట్ రెహమ్ ఖాన్‌ను ఇమ్రాన్ 2014లో వివాహం చేసుకున్నా, వారి బంధం కూడా ఏడాది మాత్రమే నిలిచింది. మూడు పెండ్లిండ్లు చేసుకున్న ఇమ్రాన్ .. తనకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదన్నాడు.
ఇమ్రాన్ మూడవ భార్య బుష్రా బీబీ. ఆమె పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంత సంప్రదాయ కుటుంబ మహిళ. బుష్రా పాకిస్తాన్లో సూఫీ సెయింట్‌గా చాలా ప్రసిద్ది., అందుకే ఆమెను పిర్ని అని కూడా పిలుస్తారు. ఈ బిరుదు సాధువులకు ఇచ్చారు. 48 ఏళ్ల బుష్రా, ఆమె తన ప్రార్థనలతో కష్టాలతో బాధపడుతున్న వ్యక్తులకు నయం చేస్తుందని ప్రతితీ.