ఇస్లామాబాద్ : అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పాక్ సుప్రీంకోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అపహరించి కర్రలతో కొట్టారని, కస్టడీలో తీవ్రంగా హింసించారని సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించారు. కాగా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్కు పాక్ సుప్రీం కోర్టు ఊరట కల్పించింది.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఆయనను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఇక ఓ కేసు విచారణ నిమిత్తం ఇటీవల ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఆయనను పాక్ రేంజర్లు కస్టడీలోకి తీసుకున్నారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనను న్యాయస్ధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆదేశ సర్వోన్నత న్యాయస్ధానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్ అరెస్ట్ చట్టవిరుద్ధమని, మాజీ ప్రధానిని కస్టడీ నుంచి విడుదల చేయాలని అవినీతి నిరోధక సంస్ధను కోర్టు ఆదేశించింది.
Read More