లండన్, డిసెంబర్ 14: యూకేలో చేపట్టిన వీసా సంస్కరణలు ఆ దేశానికి వచ్చే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఆ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీసాలు తగ్గడానికి ప్రధాన కారణం గతంలో లాగా యూకేలో స్థిరపడే అవకాశాలు విద్యార్థులకు తగ్గడమే అని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.
2024 నాటికి ముగిసే ఏడాదిలో 1.2 మిలియన్ల మంది యూకేకు వలస వచ్చారు. 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు విద్యార్థి వీసాల సంఖ్య 19 శాతం, డిపెండెంట్ల వీసాల సంఖ్యలో 69 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ప్రభావం బ్రిటన్లోని యూనివర్సిటీలపై కూడా పడింది.