వాషింగ్టన్ : అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు అమెరికా కఠిన నిబంధనలను రూపొందించబోతున్నట్లు తెలిసింది. నోటీసు ఇచ్చిన ఆరు గంటల్లోనే అక్రమ వలసదారులను పంపించేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) యోచిస్తున్నట్లు సమాచారం. వీరిని తమ సొంత దేశాలకు కాకుండా వేరే దేశాలకు కూడా పంపించేయవచ్చునని చెప్తున్నారు.
ఆయా దేశాల నుంచి వీరి రక్షణకు భరోసా లేకపోయినా పట్టించుకోరు. ఐసీఈ తాత్కాలిక డైరెక్టర్ టాడ్ లియాన్స్ ఇటీవల తమ సిబ్బందికి ఇచ్చిన మెమోలో, సుప్రీంకోర్టు గత నెలలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం, ప్రత్యామ్నాయ దేశాలకు వలసదారులను తక్షణమే పంపించేందుకు మార్గం సుగమమైందని తెలిపారు.