TikTok | చైనాకు చెందిన యాప్ టిక్‌టాక్‌పై అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలి కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్ యాప్ ప్రమాదకమైందిగా అభివర్ణించారు. భారత్, నేపాల్ తదితర దేశాలు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఆ యాప్‌ను బ్యాన్ చేసే చివరి దేశం అమెరికానే కాబోదన్నారు. నిక్కీ హేలి భారతీయ అమెరికన్ కాగా.. ఐక్యరాజ్యసమితిలో యూఎస్ రాయబారిగా సేవలందించారు.
ఫాక్స్ న్యూస్ టౌన్ హాల్లో మాట్లాడుతూ ‘చైనా వాటన్నింటిని నియంత్రిస్తోందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యాప్ మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలంటే.. మా ఫోన్లో ఆ యాప్ ఉందని ఊహించుకోండి. చైనా మీ ఆర్థిక పరిస్థితిని చూడగదు. మీ కాంటాక్టులను సైతం చూడగలుగుతారు. మీరు ఏం క్లిక్ చేశారు. దానిపై ఎందుకు క్లిక్ చేశారు. అది మిమ్మల్ని ఎలా ప్రభావం చేస్తుందో చూస్తారు. మీరుచూసేదాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ టిక్‌టాక్ చాలా ప్రమాదకరమైన భాగం వాటిని కూడా ప్రభావితం చేయగలవు’ అని పేర్కొన్నారు.
భారతదేశం టిక్‌టాక్‌ను నిషేధించిందని నిక్కీ హేలి తెలిపారు. ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తికి కారణమవుతుందన్న ఉద్దేశంతో నేపాల్ నిషేధం విధించింది. ఓ ప్రశ్నకు ఆమె స్పందించారు. దీన్ని ఇప్పుడే ముగించి.. పిల్లలకు హాని కలిగించకుండా దీన్ని ఆపండి’ అంటూ పిలుపునిచ్చారు. ఆన్లైన్లో పిల్లల మానసిక ఆరోగ్యానికి హానికరమని, ఆన్లైన్లో ప్రమాదకరమైన కంటెంట్ వ్యాప్తి చేస్తుందని అమెరికన్ చట్టసభ సభ్యులు ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ 2022లో టిక్‌టాక్‌పై హెచ్చరికలు జారీ చేశాయి. వినియోగదారుల డేటా, బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్, బయోమెట్రిక్ తదితర వివరాలను సేకరించి చైనా ప్రభుత్వంతో పంచుకునే అవకాశం ఉందంటూ హెచ్చరించాయి. అయితే, ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడన్ టిక్‌టాక్ యాప్ వినియోగించడాన్ని ప్రారంభించడం గమనార్హం. ఇటీవల 26 సెకన్ల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. అమెరికా యువ ఓటర్లు, మిగతా సంప్రదాయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు దూరంగా ఉండడంతో వారిని చేరుకునేందుకు టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.