టెల్ అవీవ్: జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో భాగంగా చూపిస్తున్నట్టున్న భారత దేశ మ్యాప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేసినందుకు ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) శనివారం క్షమాపణ చెప్పింది. భారత్, పాక్ సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో ఈ మ్యాప్ విఫలమైనట్లు అంగీకరించింది.
అయితే, ఈ మ్యాపు ఈ ప్రాంతానికి సంబంధించిన చిత్రం మాత్రమేనని స్పష్టం చేసింది. ఐడీఎఫ్ ఈ మ్యాప్‌ను పోస్ట్ చేసిన తర్వాత భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు చేశారు.