Electricity | కిగాలి, నవంబర్ 2: శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా కొంత మేరకు స్వచ్ఛ విద్యుత్తును ఉత్పత్తి చేయగల రెండు చెట్ల జాతులను రువాండాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో విద్యుత్తు కొరత ఉంది. 2030 నాటికి గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో విద్యుత్తును సరఫరా చేయాలని రువాండా నిర్ణయించింది.
దేశంలో వేగం గా, విరివిగా పెరిగే చెట్లపై అధ్యయనం చేయగా సెన్నా సియామియా, గ్లిరిసిడియా సేపియం అనే రెండు రకాల చెట్ల జాతులు విద్యుత్తు ఉత్పత్తికి అనువైనవని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి దట్టమైన కలప, అధిక కాలోరిఫిక్ విలువల వల్ల వీటిని కాల్చినప్పుడు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ చెట్లతో విద్యుత్తు ఉత్పత్తి చేయడం పర్యావరణానికి మేలని వారు తెలిపారు.