ఇస్లామాబాద్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను డబ్బు కోసం కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్సు(ఐఎస్కేపీ) కుట్ర పన్నుతున్నట్టు పాక్ నిఘా విభాగం(ఐబీ) హెచ్చరిక జారీ చేసింది. ఎయిర్పోర్టులు, రేవులు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలలో నిఘా వేస్తూ చైనా, అరబ్ దేశాల నుంచి వచ్చే విదేశీయులను లక్ష్యంగా చేసుకోవాలని ఈ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నినట్టు హెచ్చరించింది.
నగర శివార్లలో నిఘా కెమెరాలు లేని సురక్షితమైన ఇళ్లను అద్దెకు తీసుకోవాలని ఐఎస్కేపీ పథకం వేసినట్టు ఐబీ నివేదికలు వెల్లడించాయి. రిక్షాలు లేదా మోటారు సైకిళ్లకు మాత్రమే అందుబాటులో ఉండే ఇళ్లను అద్దెకు తీసుకుని వాటిలో అపహరించిన విదేశీ సందర్శకులను నిర్బంధించాలని ఐఎస్కేపీ యోచిస్తున్నట్టు పేర్కొన్నాయి.