Hydrogen Powered Electric Bicycles | ఒకప్పుడు అంటే కేవలం పెట్రోల్, డీజిల్‌తో నటించే వాహనాలు ఉండేవి. ఇప్పుడు వాటితో పాటు సీఎన్జీ, ఎల్పీజీ, ఎలక్ట్రిసిటీతో నడిచే వాహనాలు వచ్చేశాయి. కేవలం పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలనే ఉపయోగిస్తే గ్లోబల్ వార్మింగ్, కార్బన్ ఉద్గారాల వల్ల పర్యావరణ సమస్యలు వస్తుంటాయి. అందుకే ప్రపంచం మొత్తం ప్రత్యామ్నాయ వాహనాల వైపు మళ్లింది.

అయితే.. వాహనాల గోల లేకుండా ఉండేందుకు చాలామంది సైకిళ్లను వాడుతుంటారు. సైకిళ్లలోనూ చాలా రకాలు ఉంటాయి. చాలా దేశాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు చాలా పనులను సైకిళ్లనే వాడుతున్నారు. సమీప ప్రాంతాలకు సైకిల్‌నే ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో ఎక్కువ మంది అటువైపు మళ్లారు.

ఇప్పటికే ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా హైడ్రోజన్‌తో నటిచే ఎలక్ట్రిక్ సైకిళ్లను చైనాకు చెందిన YouOn కంపెనీ ఇటీవల లాంచ్ చేసింది. ముందు ఈ సైకిళ్లను జియాంగ్జు ప్రావిన్స్‌లోని చాంగ్జు అర్బన్ సిటీలో లాంచ్ చేశారు. వాటిని సిటీలో రెంట్‌కు కూడా ఇస్తున్నారు. యూఆన్ అనే యాప్ ద్వారా వాటిని రెంట్‌కు తీసుకొని నడిపించవచ్చు.

ఈ సైకిల్ సీటు కింద హైడ్రోజన్‌తో తయారు చేసిన బ్యాటరీ ఉంటుంది. ఒకసారి హైడ్రోజన్‌తో బ్యాటరీని చార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. గంటకు 23 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ సైకిల్‌ను మెల్లగా తొక్కుతూ వెళ్లినా హైడ్రోజన్ బ్యాటరీ వల్ల వేగంగా వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు.
2017 నుంచి యూఆన్ కంపెనీ హైడ్రోజన్ ఆధారిత ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారు చేయడం ప్రారంభించింది. అక్టోబర్ 2019 లో ట్రయల్ రన్ నిర్వహించిన విజయం సాధించింది. అయితే.. హైడ్రోజన్‌ను బ్యాటరీలో స్టోర్ చేయడం పెద్ద టాస్క్‌గా మారింది. చివరకు.. తక్కువ ప్రెజర్‌తో హైడ్రోజన్ ఫ్యుయెల్ ట్యాంక్‌ను సెట్ చేశారు. లిథియమ్ అయాన్ బ్యాటరీలతో తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిళ్లతో పోల్చితే హైడ్రోజన్‌తో తయారు చేసిన సైకిళ్లు ఎక్కువ మైలేజీని ఇస్తుండటం వల్ల.. 2022 లోపు మరో 10 వేల సైకిళ్లను చాంగ్జు సిటీలో ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాట్సప్ లాంటి మెసేజింగ్ యాప్‌ను రూపొందించిన ఇండియన్ ఆర్మీ.. ఎందుకో తెలుసా?
మీకు పెళ్లి కాలేదా? అయితే మ్యారేజ్ లోన్ తీసుకోవచ్చు.. బ్యాంకుల అదిరిపోయే ఆఫర్