Marriage Loans | మీకు పెళ్లి కాలేదా? అయితే మ్యారేజ్ లోన్ తీసుకోవచ్చు.. బ్యాంకుల అదిరిపోయే ఆఫర్
Marriage Loans | అది కూడా తక్కువ వడ్డీకే. ఆశ్చర్యంగా ఉంది కదా. లోన్ అంటే ఏదో పది వేలో.. ఇరవై వేలో ఇస్తారు కావచ్చు అని అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే.
Marriage Loans | కొందరికి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ.. పెళ్లి చేసుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. చదువుకోవడానికి లోన్ ఇస్తారు. కారు తీసుకుంటే లోన్ ఇస్తారు. ఇల్లు కొంటే లోన్ ఇస్తారు. కానీ.. పెళ్లి చేసుకుంటామంటే మాత్రం ఎవ్వరూ లోన్ ఇవ్వరు కదా. కానీ.. అక్కడ మాత్రం మీరు పెళ్లి చేసుకుంటామంటే చెప్పండి.. పిల్లలను కంటామంటే చెప్పండి.. మీకు లోన్స్ ఇస్తాం అంటూ పిలిచి మరీ లోన్లు ఇస్తున్నారు.

అది కూడా తక్కువ వడ్డీకే. ఆశ్చర్యంగా ఉంది కదా. లోన్ అంటే ఏదో పది వేలో.. ఇరవై వేలో ఇస్తారు కావచ్చు అని అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. పెళ్లి కోసం, తర్వాత పిల్లల ప్లానింగ్ కోసం 23 లక్షల రూపాయల వరకు లోన్ వస్తుంది. కాకపోతే ఇది మన దగ్గర కాదు లెండి. చైనాలో.
మనదగ్గర పెళ్లికి ఇప్పటి వరకు అయితే ఏ బ్యాంక్ లోన్ ఇవ్వలేదు. కానీ.. చైనాలో పెళ్లి చేసుకునేవాళ్లకు లోన్స్ ఇస్తున్నారు. జిలిన్ ప్రావిన్స్ ప్రభుత్వం.. అక్కడి ప్రజలను పెళ్లి వైపు మళ్లించడం కోసం.. పిల్లలను కనేలా ప్రోత్సహించడం కోసం.. ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. బ్యాంకులకు మద్దతు ఇచ్చిన ప్రభుత్వం.. మ్యారేజ్ కోసం స్పెషల్ లోన్స్ ఇవ్వాలని బ్యాంకులకు సూచించింది.
Marriage Loans | పిల్లలను కనేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుందో తెలుసా?
అక్కడి ప్రభుత్వం పెళ్లి చేసుకోవాలని.. పిల్లలను కనాలని అక్కడి ప్రజలను ఎందుకు ప్రోత్సహిస్తోందంటే.. జిలిన్ ప్రావిన్స్‌లో జనాభా ఒక్కసారిగా తగ్గిపోయిందట. ఇలాగే ఇది కంటిన్యూ అయితే.. భవిష్యత్తులో అక్కడ జనాభా పూర్తిగా తగ్గిపోయి ప్రావిన్స్ ఖాళీ అయిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో జనాభాను వృద్ధి చేయడం కోసం ప్రభుత్వం నడుం బిగించింది.
పెళ్లి చేసుకొని పిల్లలను కనడానికి డబ్బులు లేనివాళ్లకు బ్యాంకుల ద్వారా స్పెషల్ లోన్స్ ఇప్పిస్తోంది ప్రభుత్వం. వేరే ప్రావిన్స్‌ల నుంచి కూడా వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం మంచి ఆఫర్ ఇచ్చింది. అక్కడ జనాభాను పెంచేందుకు జిలిన్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రైలంటే రైలూ కాదు.. బస్సంటే బస్సూ కాదు
హెచ్1బీ ఇంటర్వ్యూలు ఆన్లైన్లోనే
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

