మనుషులకు మురికి వదిలించి, ఫ్రెష్‌గా చేసే వాషింగ్ మెషీన్ త్వరలో రాబోతున్నది. ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ను జపాన్ పరిశోధకులు తయారుచేస్తున్నారు.
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. అల్ట్రాసోనిక్ బాత్ అనే టెక్నాలజీ ద్వారా హైస్పీడ్‌తో వచ్చే నీరు చిన్న నీటిబుడగలుగా మారి ఒంటికి పట్టిన మురికి మొత్తాన్ని తొలగిస్తాయి. ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ తయారీ 2024లో పూర్తికానుంది.