బుధవారం 03 జూన్ 2020
International - Apr 15, 2020 , 13:48:48

డ‌బ్ల్యూహెచ్‌వోకు అమెరికా ఎంతిచ్చింది ?

డ‌బ్ల్యూహెచ్‌వోకు అమెరికా ఎంతిచ్చింది ?

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌పై అగ్ర‌రాజ్యం అమెరికా పంజా విసిరింది. నోవెల్ క‌రోనా వైర‌స్ విష‌యాన్ని ప్ర‌పంచ దేశాల‌కు తెలియ‌జేయ‌డంలో డ‌బ్ల్యూహెచ్‌వో ఆల‌స్యం చేసిన‌ట్లు అధ్య‌క్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆ సంస్థ‌కు ఇచ్చిన నిధుల‌ను ఆపేస్తున్న‌ట్లు ట్రంప్ స్ప‌ష్టం చేశారు.  ఇంత‌కీ ఆ దేశం డ‌బ్ల్యూహెచ్‌వోకు ఎంత ఇచ్చిందో తెలుసుకుందాం.  ప్ర‌పంచ ఆరోగ్య‌ సంస్థకు అత్య‌ధిక నిధులు అందిస్తున్న‌ది అమెరికానే.  గ‌త ఏడాది డ‌బ్ల్యూహెచ్‌వోకు అమెరికా 40 కోట్ల డాల‌ర్లు ఇచ్చింది. ఇది దాని బ‌డ్జెట్‌లో 15 శాతం క‌న్నా త‌క్కువే. ఇక చైనా డ‌బ్ల్యూహెచ్‌వోకు 2018-19 సంవ‌త్స‌రంలో 7.6 కోట్ల డాల‌ర్ల నిధుల‌ను అంద‌జేసింది. దీంతో పాటు ప‌ది మిలియ‌న్ల డాల‌ర్ల వాలెంట‌రీ ఫండింగ్ చేసిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో త‌న‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్న‌ది. 

ప్ర‌స్తుతం కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు సుమారు 675 మిలియ‌న్ల డాల‌ర్లు కావాలంటూ మార్చిలో డ‌బ్ల్యూహెచ్‌వో ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అంతేకాదు మ‌రో బిలియ‌న్ డాల‌ర్లు కావాలంటూ మ‌రో అభ్య‌ర్థ‌న చేసేందుకు డ‌బ్ల్యూహెచ్‌వో సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది.   ఇలాంటి స‌మ‌యంలో నిధుల‌ను ఆపివేయ‌డం దారుణ‌మ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్ తెలిపారు. నిధుల‌ను ఆపేసేందుకు ఇది స‌మ‌యం కాద‌న్నారు. logo