Bangladesh | ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) అట్టుడుకుతోంది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. రాజధాని ఢాకా సహా అనేక నగరాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఆయుధాలను చేతపట్టి వాహనాలు, దుకాణాలు, కార్యాలయాలను ధ్వంసం, దగ్ధం చేస్తున్నారు. ఇక ఢాకాలోని పీఎం అధికార నివాసంలోకి చొరబడ్డ నిరసనకారులు.. చేతికందిన వస్తువులను దోచుకెళ్లారు.
మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్ (Bangladesh Cricket Captain), ఎంపీ మష్రఫ్ మోర్తజా (Mashrafe Mortaza) ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోర్తాజా ఇంటికి నిప్పు పెట్టిన విషయం తెలిశాక.. ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు కుటుంబసభ్యులతో కలిసి తమ ఇళ్లను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లా మీదుగా ఢాకాలోని ప్యాలెస్‌ను వీడి భారత్ చేరుకున్నారు. అనంతరం రంగంలోకి దిగిన ఆర్మీ దేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశం మొత్తం ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయినప్పటికి హింస, అలర్లు ఆగడం లేదు. ఇప్పటి వరకూ ఈ అల్లర్లలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Also Read..
Sheikh Hasina | మరికొన్ని రోజులు భారత్‌లోనే షేక్ హసీనా.. ఎందుకంటే..?