PM Modi | ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించాలి.. ఇవే భారత్ నాలుగు లక్ష్యాలు.. నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీ
PM Modi : భారత్‌కు నాలుగు అతిపెద్ద ఆకాంక్షలున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించడం అందులో ఒకటని మోదీ తెలిపారు.
PM Modi : భారత్‌కు నాలుగు అతిపెద్ద ఆకాంక్షలున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించడం అందులో ఒకటని మోదీ తెలిపారు. శనివారం నెదర్లాండ్స్‌లోని హాగ్వేలో భారతీయులతో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ఆకాంక్షలు, లక్ష్యాలు, రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ఇండియాకు నాలుగు ఆకాంక్షలున్నాయన్నారు.
ఒలింపిక్స్ నిర్వహించడం, అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మారడం, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఎదగడంతోపాటు ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలవడం అనే నాలుగు లక్ష్యాలున్నట్లు వెల్లడించారు. ‘‘భారతీయ ఆకాంక్షలు అనంతం. అలాగే, మన ప్రయత్నం కూడా అపరిమితం. కీలక తయారీ కేంద్రంగా ఇండియా ఎదుగుతోంది. దేశాన్ని ఆధునిక టెక్ స్టార్టప్ వ్యవస్థగా మార్చేందుకు దేశ యువత నిరంతరం పని చేస్తోంది. దేశంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న దేశ యువతకు ధన్యవాదాలు. ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచింది. సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా ఇండియా మారనుంది. ఇటీవలే అతిపెద్ద ఏఐ సదస్సును ఇండియాలో నిర్వహించాం.
ఏఐలో అభివృద్ధి దిశగా ఇండియా ముందడుగు వేస్తోంది. దేశంలో 12 సెమీ కండక్టర్ తయారీ యూనిట్లు సిద్ధమవుతున్నాయి. వాటిలో రెండింట్లో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2014, మే 16న మా రాజకీయ ప్రయాణం మొదలైంది. ఆ రోజు దేశంలో బీజేపీకి మెజారిటీ దక్కింది. బీజేపీకి, దేశ ప్రజలకు మధ్య బంధం మరింత బలోపేతం అవుతోంది. జల్మురి ఇక్కడికి కూడా చేరిందా..? ఇటీవలి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెరిగింది. దాదాపు 80–90 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రతి ఏటా ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఇది మన దేశంలో పెరుగుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. అందుకే ఇండియాను ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అంటారు. భారత్ అభివృద్ధి చెందితే అది ప్రపంచానికి మేలు చేస్తుంది” అని మోదీ ప్రసంగించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- India
- Netherlands
- Olympics
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

