Bangladesh | పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యక్తి (Hindu worker) హత్యకు గురయ్యాడు. మైమెన్సింగ్ జిల్లాలోని ఓ వస్త్ర కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హిందూ కార్మికుడిని సహోద్యోగి (colleague) కాల్చి చంపాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 6:45 గంటల సమయంలో మెహ్రాబారి ప్రాంతంలో ఉన్న లాబిబ్ గ్రూప్ ఫ్యాక్టరీ అయిన సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్‌లో చోటు చేసుకుంది.
బాధితుడిని ఫ్యాక్టరీలో అన్సార్ సభ్యుడిగా పనిచేస్తున్న బజేంద్ర బిశ్వాస్ (42)గా గుర్తించారు. నిందితుడు నోమన్ మియా (29) కూడా అదే యూనిట్లో అన్సార్ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తూ ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్ గాయమైన బజేంద్రను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం రెండు వారాల్లో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. డిసెంబర్ 18న భాలుకాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను ఓ గుంపు కొట్టి చంపిన విషయం తెలిసిందే. అంతకుముందు, ఓ హిందూ వ్యక్తి కూడా హత్యకు గురయ్యాడు. ఇలా వరుస దాడులతో బంగ్లాదేశ్‌లోని హిందువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read..
Phone Explodes | ప్యాంట్ జేబులో పేలిన స్మార్ట్ ఫోన్.. షాకింగ్ వీడియో
PM Modi | పుతిన్ నివాసంపై డ్రోన్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ
Gold Rates | గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు