కరాచీ/పెషావర్, జూన్ 9: పాకిస్థాన్‌లో మరోసారి హిందూ ఆలయంపై దాడి జరిగింది. కరాచీలోని మారి మాత మందిర్‌పై దాడి చేసిన దుండగులు ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు జరిపారు.
ప్రత్యక్షసాక్షి ఒకరు మాట్లాడుతూ బైకులపై వచ్చిన దాదాపు 8 మంది ఆలయంపై దాడి చేశారని చెప్పారు. మరోవైపు పాకిస్థాన్‌లో మైనారిటీలుగా జీవిస్తున్న హిందూ సామాజికవర్గం జనాభా 22,10,566గా ఉన్నట్టు ఆ దేశ డాటాబేస్ రిపోర్టు తెలిపింది. దేశ జనాభాలో వీరి శాతం 1.18గా ఉన్నట్టు పేర్కొంది.