టెక్సాస్: అమెరికాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాన్ ప్రారంభమైనప్పటి నుంచి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. టెన్నెస్సీలోనే 10 మంది మరణించారు. శనివారం కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నదులు ఉప్పొంగి ప్రవహించడం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వివిధ రాష్ర్టాల్లో భవనాలు, వంతెనలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు వరదల్లో చిక్కుకునే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. లూయిస్విల్లే, కెంటకీ, మెంఫిస్లలో వాణిజ్య సరఫరాలకు అంతరాయాలు ఏర్పడొచ్చని వెల్లడించింది.