కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఐదుగురు పౌరులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని భావిస్తున్న అక్కడి పౌరులు వేలాదిగా కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు తరలి వస్తున్నారు. విమానాలు రన్‌వేలపై ల్యాండ్ అవుతున్న సమయంలో వాటి వైపు దూసుకెళ్తున్నారు. ఆగిన విమానాల్లోకి ఎక్కడానికి ఎగబడుతున్నారు. దీంతో వాళ్లను నియంత్రించడానికి అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు కాబూల్ ఎయిర్‌స్పేస్‌ను కూడా మూసివేయడంతో అన్ని విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
Apparently there are casualties at Kabul international after US troops fired shots on desperate crowds who sought to flee the country on the last flights pic.twitter.com/pNZcy402Em
— Ali Hashem علي هاشم (@alihashem_tv) August 16, 2021